Monday, October 20, 2008

నేను మా అక్క.....


ఈ ఫోటోలో బుద్ధిమంతుడిలా కూర్చున్న అబ్బాయి వేరెవరో కాదు శ్రీ శ్రీ శ్రీ "వాకాటి మహేంద్ర రెడ్డి" గారు.......చూసారా అప్పట్లోనే మనం పోకిరి స్టైల్ మైంటైన్ చేసాము..... కొంచెం ఎక్కువ అయిందా.....???? ఆఆ....పర్లేదులే సర్దుకోండి ఇప్పటికి...... ఇక ఆ పక్కన కొంచెం నోరు తెరుచుకొని నిలబడిందే ఆమె మా అక్క మహేశ్వరి....... వెనకాల పులజాడ కూడా వున్నాదండి.....

అమ్మ గురించి క్లుప్తంగా.....


అమ్మ....ఆహా...... ఎంతటి మధురమైన పిలుపు...... సృష్టిలో ప్రతి ఒక్కరు నోరార పిలవాలని తపించే రమ్యమైన పిలుపు..... ప్రతి స్త్రీ ఈపిలుపు కోసం నవమాసాలు నొప్పిని భరించి..... చివరకు ఒక జీవికి జన్మనిచ్చి వాళ్ళచేత "అమ్మ" అని పిలిపించుకోవాలని పరతపిస్తుంది..... అంతటి మధురమైన ఆ పిలుపునకు నోచుకోని ఒక అబాగ్యుడిని నేను....... నాకు పదకొండు నెలల వయసప్పుడు మా అమ్మ స్వర్గస్తురలయినది........ అప్పటి నుండి నేను మా నానమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాను.......

ఈ ప్రక్కన ఫోటోలో ఎడమచేతివైపు వున్నా ఆమే మా "అమ్మ" (గిరిజ).... తర్వాత వున్నది మా పిన్ని(లక్ష్మీ)... ఆమెచేతిలో బాబు మా సహోదరుడు(పిన్ని కొడుకు[మల్లిఖార్జున]) .....

Friday, October 17, 2008

నామకరణం....


మాములుగానే..... పుట్టిన ప్రతి వాడికి ఏదో ఒక పేరు పెట్టాలికదా అలాగే నాకు ఏమి పెట్టాలా అని అందరు కుస్తీలు పడుతూవున్నారు..... వున్నట్లుండి మా నానమ్మ అందరికి ఒక పేరు చెప్పింది.... ఎవరికీ ఏమి చెప్పాలో ఏమి అర్ధంకాలేదు.... మా అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు.... అప్పటికే మా అక్కకు మహేశ్వరి అని పెట్టివుందికదా అందుకని నాకు మహేంద్ర అని పెడదాము అని మా అమ్మ పట్టు పట్టి కూర్చుంది(Thank you very much Mom)..... మా నాన్న కూడా సరేలే అలాగే పెట్టని అని అందరికి సర్ది చెప్తున్నాడు.... ఇక చేసేదేమీ లేక అందరు సరే అన్నారు..... అలా నాకు ఈ మహేంద్ర అనే నామధేయం పెట్టారు అన్నమాట..... ఇంతకి మా నానమ్మ పెట్టాలని అనుకున్నాపేరు చెప్పలేదు కదూ.... అది... అది... సుబ్బా రెడ్డి........ :(

నా సోదరి గురించి కొంచెం....



నాకన్నా ఒక 3 సంవత్సరాల ముందు.... అంటే 1979 నవంబర్ 23వ తేదీన.... టైం నాకు సరిగ్గా తెలియదు.... ఎందుకంటే నేను అప్పటికి పుట్టలేదు కదా..... అందుకు..... మహేశ్వరి అనే నా సహొధరి జన్మించినది.......

దివి నుండి ద్రువతార నేలకు....



అది 1982వ సంవత్సరం..... డిసెంబర్ 3వ తేది సరిగ్గా సమయం సాయంత్రం 6 గం:55 నిముషాలు..... నెల్లూరు లోని జుబ్లీ ఆసుపత్రిలో కేర్ కేర్ మంటూ ఒక బాలుడి ఏడుపు..... అక్కడ వున్నఆ బాలుడి బంధువుల ఆనందానికి అవధులులేవు...... అందరు ఎంతో ఆనందంగా ఆ పిల్లవాడిని చూస్తూ వుండిపోయారు...... ఆ అందమైన బాలుడే ఈ మహేంద్ర రెడ్డి...... s/o వాకాటి కృష్ణా రెడ్డి మరియు గిరిజ......